NTV Telugu Site icon

బ్రేకింగ్ : ఈడీ అదుపులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్

ప్రముఖ పారిశ్రామికవేత్తలను మోసం చేసి వారి వద్ద నుంచి 200 కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడిన సుఖేశ్‌ చంద్రశేఖర్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయంతో తెలిసింది. అయితే బాలీవుడ్‌ భామలు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, నోరా ఫతేహి లకు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ కోట్లు విలువైన చేసే బహుమతులు ఇచ్చినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది.

జాక్వెలిన్‌కు రూ.52 లక్షలు విలువ చేసే గుర్రంతో పాటు రూ. 9లక్షలు విలువ చేసే పిల్లినే కాకుండా మొత్తంగా రూ.10 కోట్ల విలువైన బహుమతులు సుఖేశ్‌ ఇచ్చినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన జాక్వెలిన్‌ను ఈడీ అధికారులు ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు.