తప్పు చేస్తే జైల్లో చిప్పకూడు తింటావ్ అనేది సామెత. జైలులో ఎలాంటి తిండి పెడతారో కొందరు చూసే ఉంటారు. అయితే, కొందరికి జైలు జీవితం ఎలా ఉంటుంది. అక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది ? అని తెలుసుకోవాలని అనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కానీ జైలులో బిర్యానీలు, చికన్, మటన్ సహా ఎన్నో నోరూరించే వంటకాలు తిన్నారా? జైలుకు వెళ్లకుండా జైల్లో ఉన్నామనే ఫిలింగ్ ని అనుభవించాలని ఉందా. అయితే, మీ లాంటి వారి కోసమే బెంగళూరులో ఓ రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఈ రెస్టారెంట్ ని జైలు తరహాలో రూపొందించడం దీని ప్రత్యేకత. కస్టమర్లకు సర్వర్లు పోలీసులు, ఖైదీల వేషంలో ఆహారం అందిస్తారు.
వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త టెక్నిక్ లతో వ్యాపారులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే సెంట్రల్ జైలు లాంటి రెస్టారెంట్ ను ప్రారంభించారు. పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా తన సోషల్ మీడియా అభిమానులను వినోదభరితంగా ఉంచడానికి తరచుగా ప్రేరణాత్మక, ఆసక్తికరమైన పోస్ట్‌లను పంచుకుంటారు. తాజాగా ఆయన జైలును పోలి ఉండే రెస్టారెంట్ చుట్టూ ఫుడ్ బ్లాగర్ చూపించే వీడియోను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Also Read:Telangana: పెండింగ్ బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ
సెంట్రల్ జైలు రెస్టారెంట్ బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఉంది. జైలు రెస్టారెంట్ యొక్క ప్రత్యేకమైన ఇంటీరియర్‌లను అందరినీ ఆకర్షిస్తోంది. కస్టమర్లు రెస్టారెంట్‌లోకి ప్రవేశించినప్పుడు, ప్రజలు బార్‌ల వెనుక కూర్చుని ఆహారాన్ని ఆస్వాదించడం, సర్వర్లు పోలీసులు, ఖైదీల వేషం వేశారు. జైల్ కే మజా ఖావో అంటూ గోయెంకా తన పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ చేసినప్పటి నుండి ఈ వీడియో ట్విట్టర్‌లో 33,000లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇంటర్నెట్ వినియోగదారులు వేలల్లో స్పందించారు.
Jail ke mazaa khao….someone took it literally! pic.twitter.com/PD9VB4dlZy
— Harsh Goenka (@hvgoenka) April 8, 2023