ఈరోజుల్లో ఉన్న జుట్టును కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు జనాలు.. ఈ కాలుష్యల వల్ల జుట్టు మొత్తం ఊడుతుంది.. ఇక కొత్త జుట్టు పెరగడం అనేది అసలు సాధ్యం కావడం లేదని చాలా మంది వాపోతున్నారు.. కానీ ఓ యువకుడు మాత్రం పొడవాటి జుట్టును పెంచి గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు.. ఆ కుర్రాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్ తన జీవితంలో ఇప్పటివరకు తన జుట్టును కత్తిరించుకోలేదు.. అదే ఇప్పుడు అతనికి అరుదైన గుర్తింపును తెచ్చిపెట్టింది.. ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న కుర్రాడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అధికారికంగా ప్రకటిస్తూ.. సిదక్‌దీప్ వీడియోను షేర్ చేసింది… సంప్రదాయాలను గౌరవిస్తున్న అతని కుటుంబం చిన్నప్పటి నుంచి అతడి జుట్టును కత్తిరించలేదు. దీంతో ఈ 15 ఏళ్లలో అతడి జుట్టు ఏకంగా 146 సెంటీమీటర్లు పెరిగింది. ఈ రికార్డు దక్కడం పట్ల సిదక్‌దీప్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే చిన్నతనంలో ఈ జుట్టు అంటే తనకు అస్సలు ఇష్టం ఉండేది కాదని.. కానీ ఇప్పుడు తన జుట్టే తనకు గుర్తింపు తెచ్చిందని ఆనందపడుతున్నాడు..
అతను మాట్లాడుతూ.. చిన్నప్పుడు నా జుట్టు చూసి నా స్నేహితులు ఏడిపించేవారు. దీంతో జట్టు కత్తిరించుకుంటానని ఇంట్లో గొడవ చేసేవాణ్ని. కానీ, ఆ తర్వాత దీనిపై నాకు ఇష్టం పెరిగింది. ఇప్పుడు ఇది నా జీవితంలో ఒక భాగమైంది. అయితే, జుట్టు పెంచుకోవడం అంత సులువు కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తా. అందుకు కనీసం ఓ గంట పడుతుంది. జుట్టు శుభ్రం చేసుకోవడానికి మా అమ్మ నాకు సాయం చేస్తుంది.. నాకు రికార్డ్ వచ్చిందంటే నేనే ఇంకా నమ్మలేకున్నా.. ఇప్పుడు నేను సంతోషంగా ఫీల్ అవుతున్నా అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు..
Indian teen Sidakdeep Singh Chahal has never cut his hair. It’s took him 15 years to grow the longest head of hair on a teenager.
— #GWR2024 OUT NOW (@GWR) September 14, 2023