Site icon NTV Telugu

టీటీడీపై గోవిందానంద సరస్వతీ స్వామీజీ ఆగ్రహం

తిరుమలలో పరిణామాలపై మండిపడ్డారు గోవిందానంద సరస్వతీ స్వామీజీ. కిష్కింధ హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులుగా వున్న గోవిందానంద సరస్వతీ స్వామీజీ టీటీడీ వ్యాపార ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారిని అంగట్లో అమ్మొద్దన్నారు. శ్రీవారిని రోడ్డు‌మీద పెట్టి స్వామి సేవలను కోటి రూపాయలకు అమ్ముతున్నారా..?

శ్రీవారి సేవలు వెల కట్టలేనిది. సేవలను టిక్కెట్ల రూపంలో అమ్మి హాస్పిటల్ కట్టాలంటే అది సమంజసం కాదు. స్వామి పేరు చెప్పి సొమ్ము ఒకడిది..సోకు మరొకడిది అనే‌విధంగా టీటీడీ వ్యవహరిస్తోంది. సేవల అమ్మకంపై టిటిడి‌ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే టీటీడీ‌ బోర్డు నవ్వుల పాలైంది. ఈవో‌ పేరిట ప్రభుత్వాలే ఆలయాలే స్ధిర నివాసం ఏర్పరచుకుంది.

ఆలయాలను కబ్జా చేసుకుని నిధులను తమ ప్రభుత్వం ఎజెండాలకు వినియోగించుకోవడం చట్ట విరుద్ధం. జియ్యర్ స్వాములు ఏమి చేస్తున్నారు..?ఆలయాల్లో బాధ్యత నిర్వర్తిస్తున్న మతపరమైన అంశాల జోలికి ప్రభుత్వం ఎట్టి పరిస్ధితిలోనూ వెళ్ళరాదు..?టీటీడీకి ఇఓ అవసరం లేదన్నారు కిష్కింధ హనుమ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతీ స్వామీజీ.

Exit mobile version