బంగారం కొనాలనుకునే వారికి పసిడి ధరలు షాకిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చు తగ్గులను చూసినప్పటికీ శుక్రవారం మరోసారి బంగారం ధర పెరిగింది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఇవాళ మళ్లీ భారీగా పెరిగింది. ఏకంగా రూ. 550 పెరిగింది. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.
Also Read:IND VS AUS: వన్డే వార్ మొదలు.. నేడే భారత్, ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.53, 550కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 మేర పెరిగి రూ.58,420కి ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.53, 700కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.550 పెరుగుదలతో రూ.58, 570 వద్దకు చేరింది.
Also Read:Bandi Sanjay: పేపర్ లీకేజీపై దుమారం..నేడు బండి సంజయ్ దీక్ష
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,180గా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,550 కాగా, 24 క్యారెట్ల ధర రూ.58,420గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.53,600 కాగా, 24 క్యారెట్ల ధర రూ.58,470 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.200 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.72,700కి చేరింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.69, 200 వద్ద కొనసాగుతోంది.