పండగలతో నిమిత్తం లేకుండా మనదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం కొనాలని భావిస్తున్న వారికి గుడ్‌న్యూస్. దేశంలో మంగళవారం రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో విలువైన లోహాల ధరలు పతనం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రాత్రికి రాత్రే 10 గ్రాముల బంగారం ధర రూ.810 తగ్గి రూ.46,896కు చేరింది. కేవలం వారం రోజుల్లోనే పసిడి ధర రూ.2 వేల వరకు తగ్గింది.
Read Also: ఎయిర్ టెల్‌ని ఫాలో అవుతున్న వోడా ఫోన్ ఐడియా
మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.1,548 తగ్గి.. రూ.62720గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,650గా పలుకుతోంది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,050గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,600గా నమోదైంది.
