NTV Telugu Site icon

గుడ్‌న్యూస్‌: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు…

వారం రోజుల క్రితం వ‌ర‌కు భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు క్ర‌మంగా దిగివ‌స్తున్నాయి.  గ‌త వారం రోజులుగా త‌గ్గుతూ పెరుగుతూ వ‌స్తున్నాయి.  బంగారం కొనుగోలు చేయాల‌నుకునేవారు ఈ వారంలో కొనుగోలు చేయ‌డం ఉత్త‌మం.  ఈ వారంలో దాదాపు రూ. 300 నుంచి 400 మేర ధ‌ర‌లు త‌గ్గాయి.  బంగారం బాట‌లోనే వెండి కూడా త‌గ్గింది.

Read: జనవరి 2, ఆదివారం దినఫలాలు 

హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర వారం రోజుల వ్య‌వ‌ధిలో రూ. 390 వ‌ర‌కు త‌గ్గింది.  ఈ వారం మొద‌ట్లో రూ.49,590 ఉండ‌గా, వారం చివ‌రి వ‌ర‌కు వ‌చ్చే స‌రికి రూ.49,200ల‌కు ప‌డిపోయింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర వారం మొద‌ట్లో రూ.45,450 ఉండ‌గా, వారం చివ‌రి వ‌ర‌కు వ‌చ్చే స‌రికి రూ.45,100కి చేరింది.  ఇక ఇదిలా ఉంటే, కిలో వెండి ధ‌ర వారం రోజుల వ్య‌వ‌ధిలో 600 వ‌ర‌కు త‌గ్గింది.