గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడటం దేశీయంగా ధరలు పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 43,500కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి రూ.47,460కి చేరింది. ఇక బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 400 తగ్గి రూ. 63,800 కి చేరింది.
పుత్తడి ధరలకు మళ్ళీ రెక్కలు…
