NTV Telugu Site icon

మ‌ళ్లీ పెరిగిన బంగారం…

క‌రోనా కాలంలో పెరిగిన బంగారం ధ‌ర‌లు ఆ త‌రువాత క్ర‌మంగా తగ్గుముఖం ప‌ట్టాయి.  వినియోగదారుల‌కు అందుబాటులో ఉంటాయని అనుకునే లోగా క్ర‌మంగా పెర‌గ‌డం మొద‌లుపెట్టాయి.  గ‌త కొన్ని రోజులుగా పుత్త‌డి ధ‌ర‌లు ప‌రుగులు తీస్తూనే ఉన్న‌ది.  ఇప్ప‌టికే యాభైవేలు దాటిపోయింది.  ఇక సోమ‌వారం రోజున కూడా ఈ ధ‌ర‌లు పెరిగాయి.  పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో రేట్లు ఇలా ఉన్నాయి.  

Read: మెట్టుదిగిన తాలిబ‌న్‌: ఏ దేశంతోనూ మాకు…

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.210 పెరిగి రూ. 46,110కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.120 పెరిగి రూ.50,190కి చేరింది.  బంగారం బాట‌లోనే వెండికూడా ప‌య‌నించింది.  కిలో వెండి ధ‌ర హైద‌రాబాద్ మార్కెట్లో రూ.300 పెరిగి రూ.71,700కి చేరింది.  ఈ ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.