NTV Telugu Site icon

Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే

Gold Price

Gold Price

దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు బంగారం ధర రూ.10 తగ్గింది. హైదరాబాద్‌ మార్కెట్ లో 22 క్యారెట్లకు చెుందిన 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.55, 790 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.60, 860కి చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 80,200గా ఉంది.

Also Read:Kodali Nani: చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 55,790కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 60,860గా నమోదైంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 55,790గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 60,860 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధరరూ.55, 940 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,010 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ 60,860కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,520గా నమోదైంది.

Also Read:SRH vs PBKS: 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్.. 10 ఓవర్లలో స్కోరు ఇలా..
ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర తక్కువ, వెండి ధర కాస్త ఎక్కువగా ఉంటాయి. అందుకు ఆయా ప్రాంతాల్లోని ట్యాక్సులు కారణమవుతుయి. పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి.