Site icon NTV Telugu

Gmail feature: జీమెయిల్‌లో మరో ఫీచర్.. ఇక మీదట వెతకడం ఈజీ..

Gmail New Feature

Gmail New Feature

జీమెయిల్ స్మార్ట్ వర్షన్ లో మరో కొత్త ఫీచర్ ను గూగుల్ అందుబాటులో కి తీసుకొని వచ్చింది.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ కొత్త ఫీచర్ కస్టమర్స్ కు పాత ఫైల్స్ ను సులువుగా వెతికెందుకు ఉపయోగ పడుతుంది… అత్యంత కచ్చితత్వంతో, సులభంగా మెయిల్స్, ఫైల్స్, డాక్యుమెంట్స్ వెతకడంలో సాయపడుతుందని గూగుల్ మాతృ సంస్థ అయిన అల్ఫాబెట్ తన బ్లాగ్ ఈ ఫీచర్ గురించి రాసుకొచ్చింది.. ఈ ఫీచర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

స్మార్ట్ ఫోన్లో జీమెయిల్ వినియోగించే వారు యాప్ పైన ‘టాప్ రిజల్ట్స్’ అనే సెక్షన్ ని గమనించవచ్చు. ఈ సెక్షన్లోకి వెళ్లి పాత మెసేజ్ లు, మెయిల్స్, అటాచ్మెంట్స్ ని సులభంగా వెతకవచ్చు. ఈ సెక్షన్ లో ఫైల్స్ వెతకడానికి గూగుల్ లోని మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ సాయం చేస్తాయి. మీరు వెతకాలనుకుంటున్న దానికి సంబంధించిన అంశాలను ఏదో ఒకటి జోడించి సెర్చ్ చేసి మీ మెయిల్స్ ను పొందవచ్చు.. ఈ ఫీచర్ కోసం చాలా మంది కస్టమర్స్ ఇప్పటికే గూగుల్ ను కోరినట్లు సంస్థ పేర్కొంది.. ప్రస్తుతం ట్రయిల్లో ఉన్న ఈ కొత్త ఫీచర్ ను మరో రెండు వారాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించింది..

ఇకపోతే టాప్ రిజల్ట్స్ అనే ఫీచర్ ప్రస్తుతం కేవలం మొబైల్ వెర్షన్లోనే అందుబాటులో ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. మరి బ్రౌజర్ ఆధారిత జీ మెయిల్ వెర్షన్ కి ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందా లేదా అన్ని విషయంలో ఒక క్లారిటిని గూగుల్ ఇవ్వలేదు.. సెర్చ్ జెయింట్ గూగుల్ 2023 మే నెలలో జరిగిన ఐ/ఓ డెవలపర్ కాన్ఫరెన్స్ లో పలు కొత్త ఏఐ ఆధారిత ఫీచర్లను పరిచయం చేసింది. అలాగే ఓపెన్ ఏఐ ప్రారంభించిన చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకొచ్చిన బార్డ్ త్వరలో త్వరలోనే గూగుల్ సెర్చ్ కు కలపనున్నట్లు గూగుల్ పేర్కొంది..

Exit mobile version