NTV Telugu Site icon

Death By Stray Dogs: ఛత్తీస్‌గఢ్‌లో వీధికుక్కల బీభత్సం.. ఐదేళ్ల బాలిక మృతి

Stray Dogs

Stray Dogs

వీధికుక్కల దాడులతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో వీధిక్కులు చిన్న, పెద్ద అనే తేదా లేకుండా అందరిపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఆస్పత్రుల పాలైయ్యారు. హైదరాబాద్, ఖమ్మం లాంటి నగరాల్లో చిన్నారులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది.
Also Read:Bandi sanjay: కుర్చీవేసినా కేసీఆర్‌ రాలే.. షెడ్యూల్‌ ఏంటి?

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో శుక్రవారం వీధికుక్కల దాడితో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం బైకుంత్‌పూర్‌లోని మార్గదర్శన్ స్కూల్ రోడ్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో సుకాంతి(5) అనే చిన్నారి రోడ్డుపై వెళుతుండగా వీధికుక్కలు ఆమెపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కుక్కల దాడి వల్ల చిన్నారి చనిపోయిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు బైకుంత్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ అశ్వనీ సింగ్ తెలిపారు. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. తదుపరి విచారణ జరుగుతోంది.
Also Read:Akhira: నాన్న రాజకీయాల్లోకి, కొడుకు సినిమాల్లోకి… ఆరడుగుల బుల్లెట్ ఎంట్రీ ఎప్పుడు?

ఈ భయానక సంఘటన భారతదేశంలో వీధికుక్కల వల్ల కలిగే ప్రమాదాన్ని మరోసారి నొక్కి చెప్పింది. చాలా నగరాలు,పట్టణాలలో వీధికుక్కలు దాడి చేయడంతో ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పు ఏర్పడింది. వృద్ధులు, పిల్లలు తరుచూ వీధికుక్కల దాడులకు గురవుతున్నారు.

Show comments