NTV Telugu Site icon

Team India Head Coach: టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్..

Gambhir

Gambhir

భారత జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. రెండేళ్లు గంభీర్ హెడ్‌ కోచ్‌గా కొనసాగనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హెడ్ కోచ్‌గా టీమిండియాలోకి గౌతమ్ గంభీర్‌ను సాదరంగా ఆహ్వానిస్తోన్నానని చెప్పారు. క్రికెట్‌ కెరీర్‌లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్‌.. ఇండియన్‌ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందని జైషా తెలిపారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గంభీర్ కు బీసీసీఐ ఆయన అన్నివిధాలా సహకరిస్తుందని జైషా చెప్పారు. కాగా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగిసింది. అయితే.. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటన నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

Read Also: Ukrainian crisis: మోడీ సూచనకు థ్యాంక్స్ చెప్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్

టీ20 ప్రపంచకప్‌ 2007, వన్డే ప్రపంచకప్‌ 2011 టైటిల్‌ను భారత్‌ గెలుచుకుంది. ఈ విజేత భారత జట్టులో గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. రెండు టోర్నీల ఫైనల్స్‌లో అతను కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో.. అతను 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో 122 బంతుల్లో 97 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే.. గౌతీ మార్గనిర్ధేశంలో కేకేఆర్ టీమ్ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక సారథిగా కేకేఆర్ జట్టుకు రెండు టైటిల్స్ అందించాడు.

Read Also: Medak: కోమటిపల్లి మోడల్ స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటన.. నలుగురిపై చర్యలు