Hindenburg row: హిండెన్‌బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్‌తో గౌతమ్ అదానీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికపై వివాదం ఇంకా చల్లారలేదు. ఈ అంశం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసింది. హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలంటూ దేశంలోని విపక్ష పార్టీల నేతలు పట్టుబట్టిన సంగతి తెలిసిందే. విపక్ష పార్టీల ఆందోళనకు శదర్ పవార్ కు చెందిన ఎన్సీపీ కూడా మద్దతు ఇచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబైలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను ఆయన ముంబై నివాసంలో ఈరోజు కలిశారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు తాను వ్యతిరేకం కాదని, అయితే సుప్రీంకోర్టు కమిటీ మరింత ఉపయోగకరంగా, ప్రభావవంతంగా ఉంటుందని పవార్ ఇటీవల చేసిన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్ అదానీ పవార్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలోని పవార్ నివాసమైన సిల్వర్ ఓక్‌లో జరిగిన కీలక సమావేశం దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. ప్రతిపక్షాలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం.
Also Read: KA Paul: పవన్ కళ్యాణ్.. రాజీనామా చేసి ఆస్ట్రేలియాకి పో.. లేదా
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ఈ నెల ప్రారంభంలో శరద్ పవార్ అదానీ గ్రూప్‌కు తన మద్దతును అందించారు. హిండెన్‌బర్గ్ నివేదిక చుట్టూ ఉన్న కథనాన్ని విమర్శించారు. పార్లమెంట్‌లో సంఖ్యా బలం కారణంగా బీజేపీకి జేపీసీ మెజారిటీ ఉంటుందని, అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు కమిటీకి తాను అనుకూలంగా ఉన్నానని చెప్పారు. అటువంటి విచారణ గురించి సందేహాలకు దారి తీస్తుంది. జెపిసి విచారణ కోసం బిజెపి వ్యతిరేక పార్టీల డిమాండ్‌తో తమ పార్టీ ఏకీభవించనప్పటికీ, ప్రతిపక్ష ఐక్యత కోసం తమ వైఖరికి ఇది విరుద్ధం కాదని ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు.
Also Read: BJP Reacts: గాంధీ కుటుంబంపై చెంపదెబ్బ.. సూరత్ కోర్టు తీర్పుపై బీజేపీ
హిండెన్‌బర్గ్ ఆరోపణలతో ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతోపాటు స్టాక్ మార్కెట్‌లకు సంబంధించిన వివిధ నియంత్రణ అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, బిలియనీర్ అదానీకి చెందిన సంస్థలలో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ మోసం జరిగిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దాంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ విచారణకు డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!