Site icon NTV Telugu

Ganesh Visarjan 2025 : జీహెచ్ఎంసీ పరిధిలో 2.68 లక్షల గణేష్ విగ్రహాల నిమజ్జనం

Ganesh Visarjan 2025

Ganesh Visarjan 2025

Ganesh Visarjan 2025 : హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 2,68,755 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. వీటిలో ఒకటిన్నర నుంచి మూడు అడుగుల వరకు ఉన్న చిన్న విగ్రహాలు 95,782 కాగా, మూడు అడుగులకు మించి ఎత్తైన పెద్ద విగ్రహాలు 1,72,973 ఉన్నాయి. జోన్ల వారీగా చూస్తే, ఖైరతాబాద్ జోన్‌లో 63,468 విగ్రహాలు, కూకట్‌పల్లి జోన్‌లో 62,623 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఈ రెండు జోన్లలోనే అత్యధిక విగ్రహాలు జలవిలీనమయ్యాయి.

Tank Bund : ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం చేసి వస్తున్న యువత పై పోలీసులు దురుస ప్రవర్తన

అలాగే శేరిలింగంపల్లి జోన్‌లో 42,899, సికింద్రాబాద్ జోన్‌లో 38,512, ఎల్బీనగర్ జోన్‌లో 37,800, చార్మినార్ జోన్‌లో 23,453 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి.నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలో 20 చెరువులు నిమజ్జనానికి సిద్ధం చేశారు. అంతేకాదు, చిన్న విగ్రహాల నిమజ్జనం సులభంగా పూర్తయ్యేలా 74 ఆర్టిఫీషియల్ పాండ్స్ కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయడంతో నిమజ్జన కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోంది

Harish Rao : రేవంత్ హామీలు గాలిమాటలే

Exit mobile version