NTV Telugu Site icon

ఏకంగా కలెక్టరేట్‌కే ధాన్యం లోడ్‌తో వచ్చిన విప్‌ గంప గోవర్థన్‌..

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలల్లో గంప గోవర్థన్‌ రూటే సపరేటుగా ఉంటుంది. ఆయన దేనిపైన స్పందించినా తన దైనతీరుతో వెళ్తుంటారు. తాజాగా ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే అయిన గంప గోవర్థన్‌ కలెక్టరేట్ కి రైతులతో పాటు ధాన్యంలోడ్‌తో ఉన్న లారీ తీసుకువచ్చారు. 3వ తేదీ నుండి రైతులను రైస్ మిల్ యజమానులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తి చేశారు.

జిల్లా లో కొందరు రైస్ మిల్స్ యజమానులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, జిల్లాలో మిగిలిన 20 శాతం ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు చేయొద్దని అన్నారు. అంతేకాకుండా ఇబ్బంది పెడుతున్న ఆ కొందరు రైస్ మిల్ యజనములు కూడా మారాలని హెచ్చరిస్తున్నానని, రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్లు కూడా చట్ట ప్రకారం ఇబ్బంది పడతారని వార్నింగ్‌ ఇచ్చారు.