NTV Telugu Site icon

కిషన్‌రెడ్డితో గద్దర్‌ భేటీ.. అమిత్‌ షాను కలిపించండి..!

ప్రజాగాయకుడు గద్దర్‌ ఇవాళ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డితో చర్చించిన ఆయన.. తనపై ఉన్న కేసులు అన్నీ ఎత్తివేయాలని కోరారు.. ఇక, ఈ కేసులపై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని.. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని కోరారు గద్దర్.. కాగా, గతంలో తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి, న్యాయసహాయం అందించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని గతంలో విజ్ఞప్తి చేశారు గద్దర్..

ప్రభుత్వం పిలుపు మేరకు 1990లో నక్సలిజాన్ని వదిలి తాను జనజీవన స్రవంతిలో కలిశానని.. ఇక, 1997 ఏప్రిల్‌ 6న తనపై హత్యాయత్నం జరిగిందని.. వెన్నుపూస దగ్గర ఓ బుల్లెట్‌ ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు గద్దర్. ఆ బుల్లెట్‌ అనేక అనారోగ్య సమస్యలకు కారణమైందని వాపోయిన గద్దర్.. అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నాని, అలాంటిది తాను పరారీలో ఉన్నానని ప్రచారం చేయడం తగదన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకే ఈ మధ్యే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జన ఆశీర్వాద యాత్ర నిర్వహించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. హైదరాబాద్‌లో తన యాత్రను ముగించిన సంగతి తెలిసిందే.

Show comments