Site icon NTV Telugu

బీజేపీలోకి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ ?

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సుపరిచితుడే. హైదరాబాద్‌ కు చెందిన వీవీఎస్‌ లక్ష్మణ్‌… అంతర్జాతీయ క్రికెట్‌ కు అక్టోబర్‌ 12 వ తేదీ 2012 సంవత్సరంలో గుడ్‌ బై చెప్పారు. ఆ తర్వాత… ఐపీఎల్‌ టోర్నీ జట్టు అయిన డెక్కన్‌ చార్జెస్‌ కు కెప్టెన్‌ గా వ్యవహరించారు లక్ష్మణ్‌. అయితే.. వయసు మీద పడుతుండటంతో.. ప్రస్తుతం సన్‌ రైజర్స్‌ జట్టుకు మెంటర్‌ గా ఉన్నారు.

ఇది ఇలా ఉండగా… ఈ మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌… త్వరలోనే కాషాయ పార్టీ లోకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకులు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తో చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. ఎప్పుడూ సెలబ్రీటీలకు ప్రాధాన్యం ఇచ్చే బీజేపీ.. అందులో భాగంగానే.. వీవీఎస్‌ లక్ష్మణ్‌ కు గాలం వేసినట్లు సమాచారం అందుతోంది. జాతీయ నేతలే రంగంలోకి దిగడంతో.. వీవీఎస్‌ లక్ష్మణ్‌ కు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.ఇక త్వరలోనే అమిత్‌ షా సమక్షంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. జీహెచ్‌ ఎంసీలోని ఓ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వీవీఎస్‌ లక్ష్మణ్‌ ను బరిలోకి దించేందుకు బీజేపీ కి పావులు కదుపుతుందట. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Exit mobile version