Cinema Shootings: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్‌లు నిలిపివేత.. ఫిలిం ఛాంబర్ నిర్ణయం
Cinema Shootings: ఈ రోజు జరిగిన ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ కానున్నాయి. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లు కుడా జరగవు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ పూర్తి మద్దతును ప్రకటించింది. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. దీనితో రేపటినుండి మొత్తం అన్ని షూటింగులు ఆగిపోనున్నాయి. నిర్మాణంలో ఉన్న భారీ చిత్రాల నుండి స్మాల్ బడ్జెట్ చిత్రాల వరకు అన్ని షూటింగ్స్ రేపటి నుండి బంద్ కానున్నాయి. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. జనరల్ బాడి మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మళ్లీ కూర్చొని మాట్లాడుకుంటామని ఆయన అన్నారు. సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఈ నిర్ణయం ఉంటుందన్నారు.
ఇటీవల అన్నపూర్ణా స్టూడియోలో గిల్డ్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలందరూ ఈ సమావేశానికి హాజరై సినీ ఇండస్ట్రీలోని వివిధ సమస్యలపై చర్చించారు. నిర్మాతల మండలి నిర్ణయాలు, బడ్జెట్ నష్టాలు, ఓటీటీలో విడుదలపై గంటపాటు చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ మద్దతు పలికింది. రేపటి నుంచి సినిమా చిత్రీకరణలు నిలిపివేయనుండటంతో పలు అగ్రహీరోల చిత్రాలపై ప్రభావం పడనుంది. చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, బాలకృష్ణ 107వ సినిమా, ప్రభాస్ ప్రాజెక్ట్ -కె, అఖిల్ ఏజెంట్, సమంత యశోద, విజయ్ దేవరకొండ ఖుషి, రవితేజ రావణాసుర, రామ్ చరణ్-శంకర్ చిత్రంతోపాటు వంశీపైడిపల్లి-విజయ్ ల వారసుడు చిత్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
Also Read
Dulquer Salmaan: మహానటి ప్రొమోషన్ కు అందుకే రాలేదు..
రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్ చెయ్యాలని అనుకున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వెల్లడించారు. సినిమా ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారని ఆయన అన్నారు. 24 క్రాఫ్ట్స్‌లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని.. మేము అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నామనన్నారు.
https://www.youtube.com/watch?v=aeTtL9uF4X4
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!