NTV Telugu Site icon

Cinema Shootings: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్‌లు నిలిపివేత.. ఫిలిం ఛాంబర్ నిర్ణయం

Cinema Shootings

Cinema Shootings

Cinema Shootings: ఈ రోజు జరిగిన ఫిలిం ఛాంబర్ జనరల్ బాడీ మీటింగ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ కానున్నాయి. ఇప్పటికే రన్నింగ్‌లో ఉన్న సినిమా షూటింగ్‌లు కుడా జరగవు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ పూర్తి మద్దతును ప్రకటించింది. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్‌లు ఆపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. దీనితో రేపటినుండి మొత్తం అన్ని షూటింగులు ఆగిపోనున్నాయి. నిర్మాణంలో ఉన్న భారీ చిత్రాల నుండి స్మాల్ బడ్జెట్ చిత్రాల వరకు అన్ని షూటింగ్స్ రేపటి నుండి బంద్ కానున్నాయి. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వెల్లడించారు. జనరల్ బాడి మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మళ్లీ కూర్చొని మాట్లాడుకుంటామని ఆయన అన్నారు. సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఈ నిర్ణయం ఉంటుందన్నారు.

ఇటీవల అన్నపూర్ణా స్టూడియోలో గిల్డ్‌ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలందరూ ఈ సమావేశానికి హాజరై సినీ ఇండస్ట్రీలోని వివిధ సమస్యలపై చర్చించారు. నిర్మాతల మండలి నిర్ణయాలు, బడ్జెట్ నష్టాలు, ఓటీటీలో విడుదలపై గంటపాటు చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ మద్దతు పలికింది. రేపటి నుంచి సినిమా చిత్రీకరణలు నిలిపివేయనుండటంతో పలు అగ్రహీరోల చిత్రాలపై ప్రభావం పడనుంది. చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, బాలకృష్ణ 107వ సినిమా, ప్రభాస్ ప్రాజెక్ట్ -కె, అఖిల్ ఏజెంట్, సమంత యశోద, విజయ్ దేవరకొండ ఖుషి, రవితేజ రావణాసుర, రామ్ చరణ్-శంకర్ చిత్రంతోపాటు వంశీపైడిపల్లి-విజయ్ ల వారసుడు చిత్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.

Dulquer Salmaan: మహానటి ప్రొమోషన్‌ కు అందుకే రాలేదు..

రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్ చెయ్యాలని అనుకున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వెల్లడించారు. సినిమా ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారని ఆయన అన్నారు. 24 క్రాఫ్ట్స్‌లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని.. మేము అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నామనన్నారు.