NTV Telugu Site icon

హ‌ర్యానాలో కొన‌సాగుతున్న రైతుల ఆందోళ‌న‌… ఈనెల 27న భార‌త్ బంద్‌…

వ్య‌వ‌సాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త కొంత కాలంగా రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్నారు.  పంజాబ్ నుంచి గతంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  అటు ఉత్త‌ర ప్ర‌దేశ్ నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకొని నిర‌స‌న‌లు చేశారు.  ఇప్పుడు రైతులు బీజేపీ పాలిత రాష్ట్రం హ‌ర్యానాలో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేస్తున్నారు.  క‌ర్నాల్ లో రైతులు రోడ్డు మీద‌కు చేరుకొని నిర‌స‌న‌లు చేస్తున్నారు.  దీంతో క‌ర్నాల్‌లో ఇంట‌ర్నెట్‌ను నిలిపివేసింది ప్ర‌భుత్వం.  రైతు చ‌ట్టాల‌ను కేంద్రం ఉప‌సంహ‌రించుకోకుంటే ఉద్య‌మం తీవ్ర‌త‌రం చేస్తామ‌ని రైతు సంఘాలు హెచ్చ‌రించాయి.  త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో బీజేపీని ఒడించాల‌ని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.  ఈనెల 27 వ తేదీన భార‌త్ బంధ్‌ను నిర్వ‌హించాల‌ని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.  చాలా కాలంగా రైతు సంఘాలు ఉద్య‌మాలు చేస్తూనే ఉన్నా కేంద్రం దిగిరావ‌డం లేదు. రైతు చ‌ట్టాల్లో కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు ఇప్ప‌టికే కేంద్రం ఒప్పుకున్న సంగ‌తి తెలిసిందే.  

Read: వినాయ‌క చ‌వితి ఎఫెక్ట్‌: ఆ న‌గ‌రంలో మాంసం విక్ర‌యాల‌పై నిషేదం…