Site icon NTV Telugu

కంగనా రనౌత్ కు రైతుల నిర‌స‌న‌ సెగ

Kangana-Ranaut

Kangana-Ranaut

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పంజాబ్ లో రైతుల సెగ తగింది. ఆమె కారును పలువురు రైతులు కీరత్‌పురలో అడ్డుకున్నారు. చండీఘడ్-ఉనా హైవేపై ఉన్న కీరత్‌పూ ర్ సాహిబ్ వద్ద ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు ఆమె కారును అడ్డుకున్నారు. అయితే, కంగానా రనౌత్ కారుపై దాడి గురించిన సమాచారం ఏదీ తన వద్ద లేదని రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు.

ఘటనకు సంబంధించిన వివారాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు. కాగా… కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది తీసుకు వ‌చ్చిన వ్య‌వసాయ చట్టాల‌ను ఇటీవ‌ల ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిన నేప‌థ్యంలోనే… కేంద్ర ప్ర‌భుత్వం ఆ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంది. దీనిపై స్వ‌యంగా ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న చేశారు.

Exit mobile version