టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక గంట కళ్లు మూసుకుంటే మేమేంటో చూపిస్తాం అంటూ హాట్ కామెంట్లు చేశారు పరిటాల సునీత.. మాలో ప్రవహించేది సీమ రక్తమే నన్న మాజీ మంత్రి.. నా భర్తను చంపినప్పుడు కూడా.. చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారు కాబట్టే ఉన్నామన్నారు. ఇక, ఇప్పటికైనా చంద్రబాబు మీరు మారాలి అంటూ పరిటాల సునీత సూచించారు..
ఇన్నాళ్లూ ఓపిగ్గా ఉన్నాం.. ఇంకా ఓపికతో ఉండలేని పరిస్థితి ఏర్పడిందన్నారు పరిటాల సునీత.. గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం.. పార్టీ ఆఫీసు పక్కనే డీజీపీ కార్యాలయం ఉంది.. గతంలో మేం పోలీస్ విభాగాన్ని వాడుకుని ఉంటే.. వైసీపీ గుండాలు మిగిలి ఉండేవాళ్లు కాదు అని వ్యాఖ్యానించారు. పరిటాల రవిని పొట్టన పెట్టుకున్నా.. అధికారంలో వచ్చాక శాంతిగా ఉండమని చంద్రబాబు చెప్పారని గుర్తుచేసుకున్న ఆమె.. ఆనాడే చంద్రబాబు కన్నెర్ర చేసి ఉంటే.. ఒక్కరు కూడా మిగిలి ఉండే వారు కాదన్నారు.. పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్ల మీద తిరుగుతోన్నా చంద్రబాబు మీద గౌరవంతో గొడవలు పెట్టుకోలేదన్న ఆమె.. మారిన చంద్రబాబు కావాలి.. పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. అధికారంలోకి వచ్చాక గంట కళ్లు మూసుకుంటే చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. మా రక్తం ఉడుకుతోంది.. ఇప్పుడైనా సరే మీ పని మీరు చేయండని చెబితే మంత్రులను తిరగనివ్వం అని హెచ్చరించిన ఆమె… మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.. చంద్రబాబు కాళ్ల కింద ఉండే వ్యక్తులు వంశీ, నాని వంటి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. తిట్లు మాకూ వచ్చు.. మేమూ మాట్లాడగలం.. మాకూ బీపీ వస్తుంది.. మేం ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం అన్నారు పరిటాల సునీత.