Site icon NTV Telugu

ఈటలకు లైన్ క్లియర్ : జూన్ 6న బీజేపీ లోకి !

తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. ఈటల నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారని సమస్త తెలంగాణ ప్రజల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ BJPలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు గాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఈటెలతో పాటు మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి BJP లో చేరే అవకాశం ఉన్నది. బుధవారం ఉదయం నుంచి ఈటల తన నివాసంలో సన్నిహితులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. బీజేపీలో చేరిక పై అందరి అభిప్రాయాలను ఈటెల తీసుకున్నారు. బీజేపీ చేరిక పై ఈటెల శిబిరంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అందరి సూచనలు ఈటెల తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వారం రోజులుగా బీజేపీ నేతలతో జరుగుతున్న ఈటెల చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు ఈటల శిబిరం నుంచి సమాచారం అందుతున్నది.

Exit mobile version