ఈ విజయం ప్రజలది.. ఆత్మగౌరవానికి, నిజాయితీకి పట్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ విజయం ప్రజలది.. వారికి నేను ఋణపడి ఉంటానన్నారు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. తన విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. డబ్బు సంచులను, మద్యం సీసాలకు హుజురాబాద్ ఓటర్లు పాతరేశారన్నారు.. చిన్నచిన్న ఉద్యోగస్తులను కూడా అధికార పార్టీ వేధింపులకు గురిచేసిందని విమర్శించిన ఆయన.. 75 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడ జరగలేదన్నారు.. నా గెలుపునకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను నమ్ముకోలే.. డబ్బును నమ్ముకున్నారని ఫైర్ అయ్యారు ఈటల.. అధికార పార్టీ హుజురాబాద్ లో ఎన్ని పథకాలు పెట్టినా అవి ఈటల రాజేందర్ తెచ్చాడని ప్రజలు తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు.. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమంగా డబ్బులు పంచినా పోలీసులు పట్టించున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణలో నడుస్తున్నది దోపిడీ రాజ్యం అంటూ మండిపడ్డారు.. దళితులకు ఇచ్చిన హామీ దళిత బంధు హుజురాబాద్ లో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈటల రాజేందర్.
రాష్టంలో ఉన్న నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేశారు ఈటల.. రాష్టంలో ఎక్కడ సమస్యలు ఉన్నా వాళ్ల బిడ్డగా అండగా ఉంటా అని హామీ ఇచ్చిన ఆయన.. ఈ విజయం ప్రజలది.. వారికి నేను ఋణపడి ఉంటానన్నారు.. స్థానికంగా ఉన్న నాయకులు, ఓటర్లను కొనడానికి అధిక మొత్తంలో అధికార పార్టీ డబ్బులు పంపిణీ చేసిందని.. హుజురాబాద్ ప్రజలు ఆత్మగౌరవానికి, నిజాయితీకి పట్టం కట్టారని స్పష్టం చేశారు. నాకు సహకరించిన ప్రజలు, బీజేపీ అధిష్టానం, నాయకులు, కార్యకర్తలకు అందరికి కృతజ్ఞతలు అని తెలిపిన ఆయన.. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందని ఫైర్ అయ్యారు.. హుజురాబాద్ ప్రజలు చాలా తెలివైనవారు కాబట్టి నన్ను ఆదరించారన్నారు.. ఇక్కడి అధికారులు, పోలీసులు దగ్గర ఉండి డబ్బులు పంపిణీ చేశారు.. మా మీద కేసులు పెట్టారు… జిల్లా అధికారులు, పోలీసులు పూర్తిగా అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!