NTV Telugu Site icon

ఈ విజయం ప్రజలది.. ఆత్మగౌరవానికి, నిజాయితీకి పట్టం..

ఈ విజయం ప్రజలది.. వారికి నేను ఋణపడి ఉంటానన్నారు హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్‌.. తన విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. డబ్బు సంచులను, మద్యం సీసాలకు హుజురాబాద్‌ ఓటర్లు పాతరేశారన్నారు.. చిన్నచిన్న ఉద్యోగస్తులను కూడా అధికార పార్టీ వేధింపులకు గురిచేసిందని విమర్శించిన ఆయన.. 75 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడ జరగలేదన్నారు.. నా గెలుపునకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను నమ్ముకోలే.. డబ్బును నమ్ముకున్నారని ఫైర్ అయ్యారు ఈటల.. అధికార పార్టీ హుజురాబాద్ లో ఎన్ని పథకాలు పెట్టినా అవి ఈటల రాజేందర్ తెచ్చాడని ప్రజలు తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు.. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమంగా డబ్బులు పంచినా పోలీసులు పట్టించున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తెలంగాణలో నడుస్తున్నది దోపిడీ రాజ్యం అంటూ మండిపడ్డారు.. దళితులకు ఇచ్చిన హామీ దళిత బంధు హుజురాబాద్ లో వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు ఈటల రాజేందర్.

రాష్టంలో ఉన్న నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌లు వేయాలని డిమాండ్‌ చేశారు ఈటల.. రాష్టంలో ఎక్కడ సమస్యలు ఉన్నా వాళ్ల బిడ్డగా అండగా ఉంటా అని హామీ ఇచ్చిన ఆయన.. ఈ విజయం ప్రజలది.. వారికి నేను ఋణపడి ఉంటానన్నారు.. స్థానికంగా ఉన్న నాయకులు, ఓటర్లను కొనడానికి అధిక మొత్తంలో అధికార పార్టీ డబ్బులు పంపిణీ చేసిందని.. హుజురాబాద్ ప్రజలు ఆత్మగౌరవానికి, నిజాయితీకి పట్టం కట్టారని స్పష్టం చేశారు. నాకు సహకరించిన ప్రజలు, బీజేపీ అధిష్టానం, నాయకులు, కార్యకర్తలకు అందరికి కృతజ్ఞతలు అని తెలిపిన ఆయన.. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిందని ఫైర్ అయ్యారు.. హుజురాబాద్ ప్రజలు చాలా తెలివైనవారు కాబట్టి నన్ను ఆదరించారన్నారు.. ఇక్కడి అధికారులు, పోలీసులు దగ్గర ఉండి డబ్బులు పంపిణీ చేశారు.. మా మీద కేసులు పెట్టారు… జిల్లా అధికారులు, పోలీసులు పూర్తిగా అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.