Site icon NTV Telugu

మ‌స్క్‌కు నెటిజ‌న్లు చుర‌కలు… ఎల‌న్‌కు ఏమైందంటూ ట్వీట్లు…

క్ష‌ణాల్లో కోట్లు సంపాదించే తెలివైన వ్య‌క్తి ఎల‌న్ మ‌స్క్‌.  మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ప‌నులు చేసుకుంటూ వెళ్తుంటాడు.  ఎల‌క్ట్రానిక్ కార్ల రంగంతో పాటుగా మ‌స్క్ అంత‌రిక్ష‌రంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. ఇత‌ర గ్ర‌హాల‌పైకి మనుషుల‌ను పంపించ‌డ‌మే ల‌క్ష్యంగా ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ప‌నిచేస్తున్న‌ది.  అయితే, అనూహ్యంగా టెస్లా షేర్లు భారీగా పెర‌డ‌గంతో ప్ర‌పంచంలో అత్యంత ధ‌న‌వంతుడిగా రికార్డ్ సాధించాడు.  

Read: ఫ్యాక్ట్స్‌: జ‌నాభా కంటే ఆ దేశాన్ని సంద‌ర్శించేవారే ఎక్కువ‌…

300 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద క‌లిగిన తొలి వ్య‌క్తిగా రికార్డ్‌కెక్కాడు.  అయితే, ఇటీవ‌లే మ‌స్క్ త‌న ట్ర‌స్ట్ వ‌ద్ద ఉన్న 1.2 మిలియ‌న్ షేర్ల‌ను 1.2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు విక్ర‌యించాడు.  గ‌త వారం మ‌స్క్ టెస్లాలోని త‌న 10 శాతం షేర్ల‌ను విక్ర‌యించాల‌ని అనుకుంటున్న‌ట్టు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.  నెటిజన్ల ఒపీనియ‌న్ అడిగాడు.  దానిని నెటిజ‌న్ల నుంచి సానుకూల స్పంద‌న రావ‌డంతో 6.36 మిలియ‌న్ షేర్ల‌ను అమ్మేశాడు.  

Read: రియల్ చినతల్లికి సూర్య సూపర్ హెల్ప్… అసలైన ‘జై భీమ్’పై ప్రశంసలు

దీంతో టెస్లా షేర్లు ఒక్క‌సారిగా ప‌త‌నం అయ్యాయి.  2003లో టెస్లాను స్థాపించిన త‌రువాత మ‌స్క్ త‌న షేర్ల‌ను ఇలా అమ్మేయ‌డం ఇదే మొద‌టిసారి.  కార‌ణం చెప్ప‌కుండా షేర్లు అమ్మేయ‌డంతో గ‌త‌వారం టెస్లా షేర్లు ఏకంగా 15.4శాతం ప‌డిపోయాయి. టెస్లా కంపెనీ సుమారు 187 బిలియ‌న్ డాల‌ర్ల‌ను కోల్పోయింది.  వేగంగా షేర్లు ప‌త‌నం అవుతున్న‌ప్ప‌టికీ ఎల‌క్ట్రానిక్ కార్ల దిగ్గ‌జం టెస్లా అమ్మాకాల విష‌యంలో నెంబ‌ర్ వ‌న్ గా నిల‌వ‌డం విశేషం. 

Exit mobile version