Site icon NTV Telugu

ఆ రంగంలో ఎల‌న్ మ‌స్క్‌కు భార‌త్ నుంచే పోటీ…

ఎల‌న్ మ‌స్క్ 300 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా రికార్డు సాధించారు.  300 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ను క‌లిగియున్న తొలి వ్య‌క్తిగా మ‌స్క్ రికార్డ్ సాధించారు. అయితే, ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన టెస్లా షేర్లు భారీ లాభాల‌తో దూసుకెళ్తున్నాయి.  అదే విధంగా మ‌స్క్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ నాసాతో క‌లిసి పెద్ద ఎత్తున అంత‌రిక్ష ప్ర‌యోగాలు చేస్తున్న‌ది. త‌క్కువ ధ‌ర‌కే శాటిలైట్ల‌ను అంత‌రిక్షంలోకి ప్ర‌వేశ‌పెట్ట‌డ‌మే కాకుండా, స్పేస్ టూరిజం రంగంలోకి కూడా ప్ర‌వేశించింది.  ఇటీవ‌ల ముగ్గురు టూరిస్టులు మూడు రోజుల పాటు స్పేస్‌లో తిరిగి వ‌చ్చారు.  కాగా, రాబోయే రోజుల్లో మార్స్ మీద‌కు మ‌నుషుల‌ను పంపే దిశ‌గా ప్ర‌యోగాలు చేస్తున్నారు.  ఇక ఇండియాకు చెందిన అంత‌రిక్ష సంస్థ ఇస్రో ప్రైవేట్ సంస్థ‌ల‌తో క‌లిసి ప్ర‌యోగాలు నిర్వ‌హిస్తోంది. 

Read: చైనా మ‌రో కుట్ర‌… ఇండియా న‌దుల‌ను…

భార‌త అంత‌రిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థ‌ల‌ను ఆహ్వానించ‌డంతో ఇస్రో భారీగా ఆదాయం స‌మ‌కూర్చుకుంటోంది.  ప్ర‌పంచ‌దేశాల‌తో పోటీప‌డి ప్ర‌యోగాలు చేస్తున్న‌ది.  కాగా, అంతేకాదు, భార‌త్ నుంచి అంత‌రిక్షంలోకి శాటిలైట్‌ల‌ను అతి త‌క్కువ ధ‌ర‌ల‌త‌కే తీసుకెళ్తున్న‌ది.  స్పేస్ ఎక్స్ కిలోకు 22,000 డాల‌ర్ల చోప్పున వ‌సూలు చేస్తే భార‌త్ కు చెందిన ఇస్రో కేవ‌లం 10000 డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలు చేస్తున్న‌ది.  ప్ర‌పంచ స్పేస్ వ్యాపారంలో ఎలాగైనా 10 శాతం వాటాను కైవ‌సం చేసుకోవాల‌ని భార‌త్ ప్ర‌ణాళిక‌లు చేస్తున్నది. భార‌త్ 350 స్పేస్ కంపెనీల‌తో ప్ర‌పంచంలో ఐదో స్థానంలో నిలిచింది.  

Exit mobile version