ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఈ ఏడాది 11 బిలియన్ డాలర్ల పన్నును చెల్లించనున్నట్టు ప్రకటించారు. బిలినియర్ 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లిస్తున్నారని ట్వీట్టర్ ద్వారా తెలియజేయడంతో నెటిజన్లు స్పందించారు. భారీ ట్యాక్స్ చెల్లిస్తున్నందుకు ఆయన్ను అభినందించారు. అయితే, అమెరికన్ చట్టసభలు ధనవంతులు పన్నులు సరిగా చెల్లించడం లేదని, ఎలన్ మస్క్ చెబుతున్న 11 బిలియన్ డాలర్ల పన్ను సరైంది కాదని, ఆయన చెల్లించాల్సిన పన్ను అంతకంటే అధికంగానే ఉన్నట్టు చట్టసభల నేతలు చెబుతున్నారు.
Read: 5 నిమిషాల్లో 2 వేల కోట్ల విలువైన సెల్‌పోన్లు అమ్మకం…
ఎలన్ మస్క్ 11 బిలియన్ డాలర్ల పన్ను చెల్లిస్తున్నట్టు గొప్పలు పోతున్నారని, మస్క్ రోజువారి సంపాదన 36 బిలియన్ డాలర్లుగా ఉందని, అలాంటప్పుడు ఎంత పన్ను చెల్లించాలో ఆయనకు తెలుసునని, కానీ, ఆ మొత్తాన్ని చెల్లించకుండా 11 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్టు చెప్పుకోవడం సరైంది కాదని అమెరికన్ చట్టసభల నేతలు చెబుతున్నారు. ప్రపంచం మొత్తం కరోనా సమస్యను ఎదుర్కొన్న సమయంలోనూ ఎలన్ మస్క్ 270 బిలియన్ డాలర్లను వెనకేసుకున్నారని స్పష్టం చేశారు. ఇక బిలినియర్ల నుంచి పన్నులు వసూలు చేయించేందుకు బైడెన్ ప్రభుత్వం కఠినమైన పన్ను చట్టాలను తీసుకొచ్చింది. ఈ పన్ను చట్టాల నుంచి తప్పించుకోవడానికి టెక్ ధనవంతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
