NTV Telugu Site icon

ఆ ఏనుగుకి అవంటే ఇష్టం..అందుకే దాడులు

గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్​ బియ్యం ప్రజలకు అందించడం లేదు.

రాత్రికిరాత్రే రేషన్​ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయం అయిపోతున్నాయి. దొంగలు చేశారని కొందరు భావించారు. అయితే సీసీ టీవీల్లో లభ్యమయిన వీడియో చూసి అవాక్కవ్వడం అధికారుల వంతయింది. ఆకలితో అలమటిస్తున్న ఏనుగు రేషన్​ దుకాణాలపై దాడి చేసి బియ్యాన్ని తినేస్తోందట. దీంతో స్థానికులు ఆ ఏనుగుకి పేరు కూడా పెట్టారు. అదేంటంటే ‘అరికంబన్​’ అంటే బియ్యం దొంగ. అరికంబన్​ను తరిమేందుకు స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా కదలడం లేదట. పైగా వారిపై దాడిచేస్తుందేమో అని భయపడుతున్నారు. రేషన్​ దుకాణంలో బియ్యం లేకపోతే ఏకంగా ఇళ్లపై దాడి చేస్తోంది. దీంతో ప్రజలు ప్రాణ భయంతో టెన్షన్ పడుతున్నారు.