NTV Telugu Site icon

Liquor Scam: నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. విచారణపై ఉత్కంఠ

mlc kavitha

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ అధికారుల ముందు హాజరవుతారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారితో కలిపి కవితను ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఇద్దరు లేదా ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది.
Also Read:Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్.. తెలంగాణలోనూ 3 రోజులు మద్యం షాపులు బంద్‌

మరోవైపు లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా ఇప్పటికే 11 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు రెడీ అయ్యారు. పిళ్లై విచారణలో భాగంగా ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. కవితతో పాటుగా పిళ్లైను కలిపి విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే, పిళ్లై తాను ఇచ్చిన స్టేట్ మెంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కవిత విచారణకు హాజరు అవ్వటానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం కీలకంగా మారుతోంది.

Also Read:CM KCR : తెలంగాణ ప్రగతిని బీజేపీ ఓరుస్తలేదు

కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన సీఎం కేసీఆర్‌… కవితను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని అన్నారు. విచారణ పేరుతో కవితను అరెస్ట్‌ చేసి ఇబ్బంది పెట్టొచ్చు అని బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వ్యాఖ్యానించడంతో సర్వత్ర చర్చనీయాంశమైంది. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సైతం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ముగియగానే కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Show comments