NTV Telugu Site icon

ED Raids: రూ. 300 కోట్ల విరాళాలు సేకరణ..! OM చారిటీ గ్రూప్‌పై ఈడీ సోదాలు..

Ed Raids

Ed Raids

హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఆపరేషన్ మొబిలైజేషన్-OM చారిటీ గ్రూప్‌పై 11 చోట్ల ఈడీ సోదాలు చేసింది. విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టింది. రూ.300 కోట్ల విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయని వారు తెలిపారు. అంతేకాకుండా.. 16 దేశాల్లోని పిల్లలకు ఆహారం, విద్య అందిస్తామని నిధులు సేకరించిట్లు అధికారులు పేర్కొన్నారు. యూఎస్‌, కెనడా, యూకె, ఆస్ట్రేలియా, అర్జంటీనా, డెన్మార్క్, జెర్మనీ, బ్రెజిల్‌,ఫిన్‌ లాండ్, ఐర్లాండ్, మలేషియా, రూమేనియా, సింగపూర్, నార్వే సహా ఇతర దేశాల నుంచి సేకరించినట్లు ఈడీ పేర్కొంది. తాము నిర్వహిస్తున్న సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న దళితులు, అనాధ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపి విరాళాలు సేకరించింది ఈ సంస్థ.

Read Also: UK: టీవీ యాంకర్ హత్యాచారానికి కుట్ర.. ప్లాన్ బెడిసికొట్టి చివరికిలా..!

ఈ క్రమంలో.. ఏపీ, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఈడీ సోదాలు చేపట్టింది. హోంబుక్ ఫౌండేషన్ పేరుతో నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. బినామీ పేర్లతో చారిటీ నిధులు స్వాహా అయినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. కాగా.. ఈ తనిఖీల్లో వివిధ నేరారోపణ పత్రాలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తోంది.

Read Also: Renu Desai: నా కూతురు ఏడుస్తూనే ఉంది.. ఆ కర్మ మిమ్మల్ని వదలదు.. వారిపై రేణు దేశాయ్ శాపనార్దాలు