‘పందెం కోళ్లు’ అని వేటిని అంటారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పండుగంటేనే కోళ్ల పందేలకు ఫేమస్.. ఎంతో హుషారుగా కాయ్‌రాజాకాయ్ అంటూ యువతతో పాటు స్థానిక ప్రముఖులు కూడా ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే ఈ కోడి పందేలను గతంలో సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. ఆ తరువాత 2018 జనవరిలో కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అయితే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ కోడి పందేలకు ఎక్కువగా ఆతిథ్యమిస్తుంటాయి. అయితే ఈ కోళ్ల పందేలలో అన్ని కోడిపుంజులను బరిలోకి దించరు. కోళ్లలో కూడా పందెంకోళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. వాటి గురించి చాలామందికి తెలియదు.. పందెనికి వాడే పందెం కోళ్ల గురించి తెలుసుకుందాం..
కాకి – నల్లని ఈకలు గల కోడి పుంజు, నెమలి – రెక్కలపై, లేక వీపు పై పసుపు రంగు ఈకలు గల కోడి పుంజు, పర్ల – మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజు, సేతు – తెల్లని ఈకలు గల కోడి పుంజు, కొక్కిరాయి (కోడి) – నల్లటి శరీరం, 2, 3 రంగుల ఈకలు గల కోడి పుంజు, సవల – మెడపై నల్లని ఈకలు గల కోడి పుంజు, డేగ – ఎర్రటి ఈకలు గల కోడి పుంజు, కౌజు – నలుపు, ఎరుపు, పసుపు ఈకలు గల కోడి పుంజు, పూల – ఒక్కొక్క ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులు గల కోడిపుంజు, మైల – ఎరుపు, బూడిద రంగుల ఈకలు గల కోడి పుంజు, అబ్రాసు – లేత బంగారు రంగు ఈకలు గల పుంజు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం

పింగళ – తెలుపు రెక్కల పై అక్కడక్కడా నలుపు రంగు, లేత గోధుమ రంగు ఈకలు గల కోడి పుంజు, గేరువా – తెలుపు, లేత ఎరుపు ఈకలు గల పుంజు, ముంగిస – ముంగిస జూలు రంగు గల పుంజు రకాలు ఉండగా. వీటితో పాటు తక్కువగా లభించే రకాలు.. తెలుపు గౌడు (నలుపు, తెలుపు ఈకలు గల కోడి పుంజు), కాకి నెమలి, కోడి నెమలి, పచ్చ కాకి, ఎరుపు గౌడు (నలుపు, ఎరుపు ఈకలు గల కోడి పుంజు), నల్ల మచ్చల సేతు (తెల్లని ఈకలపై నల్ల మచ్చలు గల కోడి పుంజు), నల్ల సవల (రెక్కల పై నల్ల మచ్చలు గల కోడిపుంజు). అయితే ఈ కోడి పుంజులలో పచ్చకాకి, కాకి, డేగ, కాకి నెమలి రకాలు ప్రత్యేకమైనవేకాకుండా ఖరీదులోనూ ఆగ్రస్థానంలో ఉంటాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!