Kamanpur Police: కమాన్‌పూర్‌లో కోడి పందేలు జరుగుతుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పందెం కాసిన రెండు కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతి పందాల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు.. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెబుతన్నారు. కోడి పుంజులు అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది అంటే మామూలు విషయం ఏమీ కాదు.
సంక్రాంతి పండుగంటేనే కోళ్ల పందేలకు ఫేమస్.. ఎంతో హుషారుగా కాయ్‌రాజాకాయ్ అంటూ యువతతో పాటు స్థానిక ప్రముఖులు కూడా ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే ఈ కోడి పందేలను గతంలో సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. ఆ తరువాత 2018 జనవరిలో కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అయితే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ కోడి పందేలకు ఎక్కువగా ఆతిథ్యమిస్తుంటాయి.…