అరెస్టులు, కేసులతో భయపడే ప్రసక్తే లేదు : డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందని, కేసీఆర్‌కు ప్రజలు చరమ గీతం పాడుతారని డీకే అరుణ మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. కరోనా నిబంధనలు కేవలం బీజేపీ కు మాత్రమే వర్తిస్తాయా అని, టీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభలు, సమావేశాలు పెట్టినప్పుడు ఏ నిబంధనలు గుర్తు రాలేదా అని డీకే అరుణ పోలీసులను ప్రశ్నించారు. కండువా వేసుకొని టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఎప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలో ఉండదన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకుంటే మంచిదని ఆమె అన్నారు. కేసీఆర్ నియంత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, టీఆర్‌ఎస్‌ను పాతాళానికి తొక్కెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఈ విషయంపై కరీంనగర్ కమిషనర్ సత్యనారాయనతో డీకే అరుణ మాట్లాడగా.. కరోనా నిబంధనలు అతిక్రమించినందుకు బండి సంజయ్ పై కేసులు నమోదు చేశామని చెప్పడంతో, కేవలం బీజేపీ కు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా అని డీకే అరుణ కమిషనర్ ను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఇంకా ఎంత మంది నాయకులను అరెస్ట్ చేస్తారో చేయండని, అరెస్టులు కేసులతో భయపడే ప్రసక్తే లేదని, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని డీకే అరుణ తెలియజేశారు. అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపినంత మాత్రాన ప్రజల కోసం తమ పోరాటం ఆగదని డీకే అరుణ స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!