Site icon NTV Telugu

US Shocking: ఉల్లిపాయలు కోసే విషయంలో ఘర్షణ.. ప్రియురాలి హత్య

Onion

Onion

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది లోకంలో ఉండే నానుడి. కానీ ఉల్లిపాయలు ఇద్దరి లవర్స్ మధ్య తగాదా పెట్టి ప్రాణాలు తీసిన ఘటనలు ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. తాజాగా జరిగిన ఓ ఘటన షాకింగ్ కలిగిస్తోంది. ఉల్లిపాయలు కోసే విషయంలో ప్రేమికుల మధ్య తలెత్తిన ఘర్షణలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన అమెరికాలో జరిగింది.

ఇండియానా ప్రాంతంలో చార్లెస్ మైఖేల్ కాల్వెర్ట్ (60), మార్సియా లిన్స్కీని స్నేహితులుగా ఉంటూ కలిసి జీవిస్తున్నారు. అయితే ఉల్లిపాయలు కోసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. అంతే ఆవేశంలో ఆమె కత్తితో అతనిపైకి వచ్చింది. అతడు కూడా కోపం తెచ్చుకుని అదే కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు.

పోలీసుల సమాచార ప్రకారం.. లిన్స్కీ రక్తపు మడుగులో ఉందని.. మెడపై పెద్ద గాయంతో ఆమె మరణించిందని తెలిపారు. లిన్స్కీనే మొదట కత్తితో అతని పైకి వచ్చిందని.. ఆత్మ రక్షణ కోసం అతని చేతిలో ఉన్న కత్తితో పొడిచి చంపాడని వెల్లడించారు.

Exit mobile version