టీ20 ప్రపంచ కప్ 2021 సూపర్ 12 ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రపంచ కప్ కు ముందు భారత్ ఇంగ్లాండ్ తో ఆడిన సిరీస్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోహ్లీ మాట్లాడుతూ.. తాను ప్రపంచ కప్ లో కూడా ఓపెనింగ్ చేస్తాను అని చెప్పాడు. దాని తగ్గట్లుగానే యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 లో కూడా కోహ్లీ బెంగరులు జట్టు తరపున ఓపెనర్ గా వచ్చాడు. కానీ ఇప్పుడు రోహిత్ తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు అని క్లారిటీ ఇచ్చాడు. అయితే నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ వంటి ఆటగాడు ఓపెనర్ గానే ఉండాలి. అతను వన్ డౌన్ లో వస్తే చూడలేం అని అన్నాడు. ఈ ప్రపంచ కప్ లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ లు ఓపెనర్లుగా వస్తారు అని… నేను వన్ డౌన్ లో వస్తాను అని కోహ్లీ స్పష్టం చేసాడు. ఇక నిన్నటి ప్రాక్టీస్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ కేవలం 24 బంతుల్లో 51 పరుగులు చేసిన విషయం తెలిసిందే.