పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాల పై ఫోకస్ పెట్టారు.. ఒక సినిమా చేతిలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నారాని సమాచారం.. ప్రస్తుతం యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు. తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే. ఈగ,బాహుబలి,ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ సోలమాన్, దేవరకు కూడా ఫైట్స్ కంపోజ్ చేయనున్నాడు.
ప్రస్తుతం షెడ్యూల్ లో సోలమాన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇక ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ తో చిత్ర బృందం చాలా హ్యాపీ గా ఉందట..ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.. కొరటాల శివ డైరెక్టన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ 5న తెలుగుతోపాటు హిందీ,తమిళ ,కన్నడ,మళయాళ భాషల్లో విడుదలకానుంది..
ఈ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య ఈ ఏడాది స్టార్ట్ అయ్యింది.. అయితే స్టార్ట్ అయ్యే ముందు ఎంత గ్యాప్ వచ్చిందో ఇప్పుడు అంత జెట్ స్పీడ్ తో మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఏడో షెడ్యూల్ ను షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ నెల చివరి నుంచి షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. ఇక ముందుగా ప్రకటించిన విధంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవరని థియేటర్స్ లో తీసుకు రావాలని భావిస్తున్నారు..
#Devara 🔥🔥🔥
31st నుండి 7th schedule start 🥳
ఈసారి సముద్రపు అలలతో పాటు తెగిన తలలు భయాన్ని హెచ్చరించే సమరం ఆరంభం 🥵
సంద్రం సమరానికి సిద్ధం 🥵🥵🥵@tarak9999 @DevaraMovie @NTRFanTrends pic.twitter.com/sXm50iyhjQ
— Team #Devara (@YuvasudhArts) July 28, 2023