పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దూపై ఢిల్లీ సీఎం ప్రశంసలు కురిపించారు. గత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో పాటు, ఇప్పటి సీఎం చరణ్ జిత్ సింగ్ చేతిలో కూడా సిద్దూ అణిచివేతకు గురవుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సిద్దూ ధైర్యాన్ని తాను ప్రశంసించానని, రాష్ట్రంలో క్యూబిక్ అడుగు ఇసుకను రూ.5 కు అమ్ముతున్నట్టు ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చెప్పగా, అది అబద్దమని, రాష్ట్రంలో క్యూబిక్ అడుగు ఇసుకను రూ. 20 కి అమ్ముతున్నట్టు సిద్దూ చెప్పడం గొప్ప విషయం అని అన్నారు. ప్రజల సమస్యలపై సిద్దూ పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్ పార్టీ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఆప్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే, తాము చెత్తలను చేర్చుకునేందుకు సిద్దంగా లేమని ఢిల్లీ సీఎం తెలిపారు.
సిద్దూపై ఢిల్లీ సీఎం ప్రశంసలు… ప్రజల కోసమే…
