IPL 2023 Delhi Capitals: ఢిల్లీ కొత్త కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్.. వైస్ కెప్టెన్‌గా అక్సర్ పటేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ – 16వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త సారథిని ప్రకటించింది. కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయంతో ఈ సీజన్‌కు దూరమైన కారణంగా కొత్త సారథిని నియమించింది. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు తమ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ప్రకటించింది. ఈ సీజన్లో అక్సర్ పటేల్ ఆసీస్ డిప్యూటీగా ఎంపికయ్యాడు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ సారథిగా నియమించడం విశేషం. ఢిల్లీ ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన కూడా చేసింది. టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ అతడికి డిప్యూటీగా ఉండనున్నాడు. డేవిడ్ వార్నర్ (సి), అక్షర్ పటేల్ (విసి) నాయకత్వంలో ఈ #IPL2023 బిగ్గరగా గర్జించడానికి అంతా సిద్ధంగా ఉంది అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay: రోడ్డు మీద సెల్ఫీలు దిగుతా వారితో సంబందం ఉన్నట్టా? అఖల్ ఉండాలి అనడానికి..
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకూ ట్రోఫీ గెలుచుకోలేదు. 2020లో ఆ జట్టు ఫైనల్స్‌కు వెళ్లినా ట్రోఫీ మాత్రం కొట్టలేకపోయింది. ఆ సీజన్ లో శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీని విజయవంతంగా నడిపించాడు. కానీ గాయం కారణంగా అతడు తర్వాతి 2021 సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో గత రెండేండ్లు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఢిల్లీని నడిపించాడు. అయితే గతేడాది పంత్ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన నేపథ్యంలో ఢిల్లీకి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది.
కాగా, గతంలోనూ ఢిల్లీ డేర్ డెవిల్స్ కి వార్నర్ సారథిగా వ్యవహరించాడు. 2009 నుంచి 2013 సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడిన వార్నర్.. అప్పుడు కూడా కొన్ని మ్యాచ్ లకు తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయిలో ఢిల్లీ జట్టకు నాయకత్వం వహించనున్నాడు. టోర్నమెంట్ చివరి ఎడిషన్‌లో, వార్నర్ 150.62 స్ట్రైక్ రేట్‌తో 12 మ్యాచ్‌ల్లో క్యాపిటల్స్ తరఫున 432 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఐదు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
David Warner 👉🏼 (𝗖)
Axar Patel 👉🏼 (𝗩𝗖)All set to roar loud this #IPL2023 under the leadership of these two dynamic southpaws 🐯#YehHaiNayiDilli | @davidwarner31 @akshar2026 pic.twitter.com/5VfgyefjdH
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!