దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కేద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయగా.. రాజ్ నాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరు కావాల్సి ఉంది. అయితే వైరస్ కారణంగా ఆయన దానిని రద్దు చేసుకున్నారు.
రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వైద్యుల బృందం ఆయనను పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా, బుధవారం రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ కమాండర్ల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఇతర సీనియర్ ఆర్మీ అధికారులు ఉన్నారు.
Also Read:Hindenburg row: హిండెన్‌బర్గ్ నివేదికపై వివాదం.. శరద్ పవార్‌తో గౌతమ్ అదానీ సమావేశం
మరోవైపు భారతదేశంలో 12,591 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది సుమారు ఎనిమిది నెలల్లో అత్యధికం. క్రియాశీల కేసులు 65,286కి పెరిగాయి. వైరస్ కారణంగా 40 మంది మరణించారు. ఇందులో కేరళనే 11 మంది ఉన్నారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,31,230కి పెరిగింది.