జవాద్ తుఫాన్ ముప్పు ఆంధ్రప్రదేశ్‌కు తప్పినట్టుగానే అంచనా వేస్తున్నారు అధికారులు.. విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న జవాద్ తుఫాన్.. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ బలహీనపడుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.. దీంతో ఉత్తరాంధ్రకు “జవాద్” తుఫాన్ ముప్పు తప్పినట్టేనని.. ఉత్తరాంధ్ర తీరానికి సమీపించి క్రమేపీ బలహీనపడుతూ ఒడిశా వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు..
Read Also: మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం.. సంప్రదింపులతోనే సమస్యలకు పరిష్కారం..
ఇక, జవాద్ తుఫాన్ ప్రభావంతో.. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని.. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.. ఇక, ఉత్తరాంధ్ర తీరానికి సమీపిస్తున్న కొద్ది బలహీనపడుతూ.. ఒడిశా వైపు వెళ్లనున్న జవాద్ తుఫాన్.. రేపు ఒడిశాలోని పూరి దగ్గర తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు.. కాగా, జవాద్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్ అయిన ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు.. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమై ఉన్నారు.
