Site icon NTV Telugu

సీవీఎల్ సంచలన కామెంట్స్: ప్ర‌కాష్ రాజ్‌ను ఓడించండి.. మన బిడ్డలను గెలిపించండి

నటుడు సీవీఎల్ నరసింహారావు మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ ప్యానల్ పై సంచలన కామెంట్స్ చేశారు.

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి. దేశం అన్నా.. దేవుడు అన్నా.. చులకన భావం వున్న ప్రకాష్ రాజ్ ను ఒడించండి. నేను.. నేను.. నేను.. తప్పు మరొక విషయం పట్టని ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా వుంటే బాగుంటుంది. బహుశా అతను విత్ డ్రా చేసుకుంటాడు అని ఆశిస్తున్నాను’ అంటూ సీవీఎల్ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ప్రకాష్ రాజ్ ‘మా’ అధ్యక్ష బరిలో నిలుచున్నప్పటి నుంచి లోకల్, నాన్ లోకల్ అనే చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ వేరే రాష్ట్రానికి చెందిన వాడు అని ఆయనకు అధికారం ఎలా కట్టబెడతారు అంటూ ప్రత్యర్థి బృందం వాదిస్తోంది. మరోవైపు తనను పెంచింది తెలుగు పరిశ్రమనే అంటూ కాబట్టి తాను తెలుగు వాడినే అంటూ ప్రకాష్ చెబుతున్నారు. ఈ నెల 10న మా ఎన్నికలు జరగనుండగా.. ఆరోజే ఫలితాలు వెలువడనున్నాయి.

CVL Narasimharao Press Meet | MAA Elections | Ntv Live
Exit mobile version