లక్నో విమానాశ్రయంలో కోటి రూపాయల విలువైన విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, జెడ్డా నుంచి వస్తున్న ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. అరబ్ దేశాల నుంచి కొత్త పద్దతుల ద్వారా భారత్ కు బంగారాన్ని తరలించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమ మార్గంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను హెయిర్ రిమూవల్ క్రీమ్‌లో దాచి తరలించేందుకు ప్రయత్నించగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మరికొంతమంది కేటుగాళ్లు బంగారాన్ని కరిగించి పేపర్ గా మార్చి కార్డ్బోర్డ్ పొరల్లో దాచి తరలించే ప్రయత్నం చేయగా కస్టమ్స్ అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read: ఒకసారి ఛార్జింగ్ చేస్తే చాలు… 750 కిమీ ప్రయాణం చేయవచ్చు…