Tomato : అరె ఏంట్రా ఇది.. మరీ దారుణంరా.. హోటల్స్ లో షాక్ ఇస్తున్న బోర్డులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టమోటా పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు.. వద్దు బాబోయ్ అంటున్నారు సామాన్యులు.. ధరలు తగ్గుతాయాన్న ఆశ లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన ఇదే టాపిక్ నడుస్తుంది.. టమోటా ధరలు డబుల్ సెంచరీ దాటుతున్నాయి. బంగారం రేటుతో పోటి పడుతూ దారుణంగా పెరుగుతున్నాయి.. సామాన్యులు అస్సలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.. టమాటా రేట్లు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర సెంచరీ దాటేసి దూసుకుపోతుంది. దాంతో ఈ కూరగాయ పేరు వింటే చాలు జనాలు బెంబేలెత్తిపోతున్నారు.
ఇక టమాటా ఎఫెక్ట్ మామూలుగా లేదు. హోటళ్ల నిర్వాహాకులకు నిద్ర లేకుండా చేస్తోంది. టమాట దెబ్బకు తమ హోటళ్లలో కొత్త రకం బోర్డులు పెట్టాల్సి వచ్చింది. ఉప్పు లేని పప్పు టమాటా లేని కర్రీ రుచిగా ఉండదు. శాకాహారం నుంచి మాంసాహారం వరకు అన్ని కూరల్లో టమాటా పడాల్సిందే. కానీ ఇది కొన్ని రోజుల క్రితం. ఇప్పుడా పరిస్థితి లేదు. టమాటా రేట్లు ఠారెత్తిస్తున్నాయి. కిలో ధర రూ.120 నుంచి 160 రూపాయలకు చేరింది. కొన్ని చోట్ల మరీ దారుణం రూ.200 దాటింది.. దాంతో ఇళ్లతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగం భారీగా తగ్గించేశారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది..
Also Read
ఒకప్పుడు కర్రీల్లోనే కాదు రసం, సాంబార్ లోనూ టమాటాను వాడటం లేదు. దాంతో హోటల్స్ లో టిఫిన్, భోజనం చేసే వారు గతంలోని రుచులను పోల్చుకుని టమాటా వేయలేదా అని నిర్వాహాకులను నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల కస్టమర్లు, హోటళ్ల నిర్వాహాకుల మధ్య గొడవలు, ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. దాంతో కస్టమర్లతో ఎందుకొచ్చిన తంటా అని.. హోటళ్లు, నిర్వాహాకులు జాగ్రత్త పడుతున్నారు. టమాటా కర్రీ అడగొద్దని ఏకంగా బోర్డులే పెట్టేస్తున్నారు.. కస్టమర్ దేవుళ్లకు ముఖ్య గమనిక.. ఇక్కడ టమాటా కర్రీ అందుబాటులో లేదు.. దయచేసి అడగరాదు అంటూ బోర్డులు రాసి హోటల్స్ ముందు పెడుతున్నారు..హైవేస్, స్టేట్ హైవేస్ పై డాబాలు, రెస్టారెంట్లు ఎక్కువ. ప్రయాణికులు, వాహనాల డ్రైవర్లు వీటిలోనే ఎక్కువగా తింటుంటారు. టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.50 ఉన్నప్పుడు రోజుకు 15 నుంచి 20 కిలోల టమాటా వాడిన నిర్వాహాకులు ఇప్పుడు 2 నుంచి 3 కిలోలతోనే సరిపెడ్తున్నారు. దాంతో సాంబారు, రసం, కర్రీలు రుచిగా ఉండటం లేదని కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. వారికి సమాధానం చెప్పలేక నిర్వాహాకులు సతమతం అవుతున్నారు.. రేట్లు పెంచితే కస్టమర్లు హోటల్స్ వైపు చూడరు.. పెంచక పోతే మాకు నష్టాలు వస్తాయని వాపోతున్నారు.. మరి ఈ ధరలు ఎప్పటికి తగ్గుతాయో చూడాలి..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?