డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎత్తైన ప్రతేశాల నుంచి ఫొటోలు, వీడియోలు మాత్రమే కాదు, అత్యవసర మందులను సరఫరా చేయడానికి వినియోగిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్‌లలో కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీ సహాయంతో ఆస్ట్రేలియాలో ఓ యాప్ ఫుడ్ డెలివరీ చేస్తున్నది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో డ్రోన్ల ద్వారా ఫుడ్‌ను డెలివరీ చేస్తున్నారు. కాన్‌బెర్రాకు చెందిన రాబర్డ్ అనే వ్యక్తి కాఫీ ఆర్డర్ చేశారు. ఆర్డర్ కోసం ఎదురు చూస్తుండగా, ఆకాశంలో డ్రోన్ ఎగురుతూ వస్తున్నది. ఇంతలో ఓ పెద్ద కాకి ఆ డ్రోన్‌పై దాడి చేసింది, డ్రోన్‌ను అటుఇటూ కుదిపేసింది. కాసేపటికి డ్రోన్‌ను వదిలేసి వెళ్లిపోయింది. అనంతరం డ్రోన్ సురక్షితంగా కాఫీని కస్టమర్‌కు డెలివరీ చేసింది. ఈ తతంగాన్ని కిందనుంచి చూస్తున్న రాబర్ట్ వీడీయోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఏదో విచిత్రమైన పక్షి అనుకొని కాకి దాడి చేసి ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు. అయితే, డ్రోన్‌కు అమర్చిన కాఫీ కోసమే ఆ కాకి దాడి చేసి ఉండొచ్చని యాప్ యాజమాన్యం చెబుతున్నది.
Read: ఆ చెట్టుకోసం నెలకు లక్ష ఖర్చు… చుట్టూ వీవీఐపీ భద్రత… ఎందుకంటే…