ఆ చెట్టుకోసం నెల‌కు ల‌క్ష ఖ‌ర్చు… చుట్టూ వీవీఐపీ భద్రత… ఎందుకంటే…

అది 15 అడుగుల ఎత్తు పెరిగిన చెట్టు.   ఆ చెట్టు చుట్టూ ఎప్పుడూ ప‌టిష్ట‌మైన భ‌ధ్ర‌త ఉంటుంది.  24 గంట‌లూ చెట్టు ద‌గ్గ‌ర ముగ్గురి నుంచి ఐదుగురు ప‌హారా కాస్తుంటారు.  ఎవ‌ర్నీ ఆ చెట్టు ద‌గ్గ‌ర‌కు అనుమ‌తించ‌రు.  అంతేకాదు,  వీఐపీలు, వీవీఐపీలు కంచెదాటి చెట్టు వ‌ద్ద‌కు వెళ్లాల‌న్నా త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తులు తీసుకోవాల్సిందే.  ఇంత భ‌ద్ర‌త మ‌ధ్య ఉన్న ఆ చెట్టు పేరు ఏంటి? ఎందుకు అంతటి భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్నారు.  తెల‌సుకుందాం.  

అది బొధి చెట్టు.  బుద్దుడికి బొది వృక్షం కింద‌నే జ్ఞానోద‌యం అయింది.  బుద్ధుడికి జ్ఞానోద‌యం అయిన బొదిచెట్టుకు సంబంధించిన చిన్న కొమ్మ‌ను క్రీస్తుపూర్వం 3 శ‌తాబ్దంలో బొదిగ‌య నుంచి శ్రీలంక‌లోని అనురాధ‌పురంలో నాటి సంర‌క్షించారు.  అప్ప‌టి నుంచి దాని నుంచి వ‌చ్చిన చిన్న చిన్న కొమ్మ‌ల‌ను నాటి ఆ ప్రాంతం మొత్తం విస్తరించేలా చేశారు.  కాగా, సెప్టెంబ‌ర్ 21, 2012లో అనురాధ‌పురం నుంచి బొదిచెట్టు కొమ్మ‌ను ఇండియాకు తీసుకొచ్చి చారిత్రాత్మ‌క‌మైన సాంచిలోని స‌లామ‌త్‌పూర్ కొండ‌పై నాటారు.  ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీలంక అద్య‌క్షుడు రాజ‌ప‌క్సే స్వ‌యంగా నిర్వ‌హించారు.  ఆ త‌రువాత భార‌త ప్ర‌భుత్వం ఈ చెట్టుకు వీవీఐపీ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్న‌ది.  ప్ర‌తినెలా ఈ చెట్టు సంర‌క్ష‌ణ కోసం ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తుంది.  భ‌ద్ర‌త కోసం సంవ‌త్స‌రానిక 13 నుంచి 15 ల‌క్ష‌ల ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌.  ప్ర‌త్యేక‌మైన ట్యాంక‌ర్ల ద్వారా తీసుకొచ్చిన నీటిని ఈ చెట్టుకు పోస్తారు.  చిన్న మొక్క‌గా నాట‌గా నేటికి 15 అడుగుల చెట్టుగా ఎదిగింది.  ఈ చెట్టును వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు నిత్యం ప‌ర్య‌వేక్షిస్తుంటారు.  చెట్టునుంచి అన‌వ‌స‌రంగా ఒక్క ఆకు రాలినా భ‌ద్ర‌తా సిబ్బంది గుండెలు గుభేలుమంటాయ‌ట‌.  ఇక ఈ చెట్టును ద‌ర్శించుకోవ‌డానికి నిత్యం అనేక మంది ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.  ఎవ‌రు వ‌చ్చినా దూరం నుంచి చూసి వెళ్ల‌డ‌మే తప్పించి చెట్టుకు ముట్టుకోవ‌డానికి అక‌వాశం ఉండ‌దు.  

Read: రైల్వే కోచ్‌ల‌లో ప‌సుపు… తెలుపు గీత‌ల‌కు అర్ధం ఏంటో తెలుసా…

Related Articles

Latest Articles