Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ అతనిపై ఫిర్యాదు చేశారు. పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌పై కూడా సప్నా ఫిర్యాదు చేసింది. బ్యాట్‌తో కొట్టడం, వేధించడం వంటి కొన్ని కేసుల్లో సప్నా గిల్ ఐపీసీ సెక్షన్ 354, 509, 324 కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నమోదు చేస్తూ సప్నా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఇందులో లైంగిక వేధింపుల ప్రస్తావన కూడా ఉంది.
Also Read: Stormy Daniels: ట్రంప్‌కు లీగల్ ఫీజు చెల్లించండి.. డేనియల్స్‌కు కోర్టు ఆదేశం
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
షా తన రొమ్ములపై చేతులు వేసి దూరంగా నెట్టాడని చెప్పింది. ఆమె తనపై బ్యాట్‌తో దాడి చేసినందుకు IPC సెక్షన్ 354, 509, 324 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరింది, లైంగిక వేధింపులను రుజువు చేసే కీలకమైన రుజువు అయిన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన మెడికల్ ప్రూఫ్‌ను జత చేసింది. అయితే, గతంలో సప్నా ఇదే కేసులో అరెస్టైంది. ఇప్పుడు ఆమె బాధితురాలిగా పేర్కొంది.
Also Read: Rajasthan Royals vs Punjab Kings: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్
పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ఇటీవల ముంబైలోని ఓ హోటల్‌కు వెళ్లిన పృథ్వీషాతో సెల్ఫీ దిగేందుకు సప్నా గిల్, ఆమె స్నేహితులు ప్రయత్నించారు. మొదట ఓ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్వీషా.. ఆ తర్వాత పదేపదే అడగడంతో నిరాకరించారు. దీంతో హోటల్ నుంచి వెళ్లిన తర్వాత క్రికెటర్‌ను వెంబడించి వాగ్వాదానికి దిగారని, తన స్నేహితుడి కారును ధ్వంసం చేశారని పృథ్వీషా ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సప్నా గిల్ సహా ఆమె స్నేహితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన సప్నా గిల్ పృథ్వీషాపై కేసు పెట్టింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!