Site icon NTV Telugu

మెద‌డుపై క‌రోనా ప్ర‌భావం… ప‌రిశోధ‌కులు ఏం చెప్తున్నారంటే…

క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా ప్ర‌పంచం మొత్తం స్థంభించిపోయింది.  ఆరోగ్య‌, ఆర్థిక ఇబ్బందులు క‌లిగించిన క‌రోనా, మెద‌డుపై తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపుతున్న‌ట్టు వార్త‌లు వచ్చిన నేప‌థ్యంలో ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు 3.2 కోట్ల మందికి సంబంధించిన ఆరోగ్య విష‌యాల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు.  క‌రోనా సోకిన 28 రోజుల త‌రువాత లేదా అస్త్రాజెన‌కా వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల త‌రువాత నాడీ సంబంధ‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయా? ఉంటే ఎలా ఉన్నాయి అనే అంశంపై ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించారు.  తొలిడోసు వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలో కొంద‌రికి ప‌క్ష‌వాతం లేదా మెద‌డులో ర‌క్త‌స్రావం వంటివి స్వ‌ల్పంగా క‌లుగుతున్నాయ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు.  అయితే, వ్యాక్సిన్ కంటే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగానే నాడీ సంబంధ‌మైన ఇబ్బందులు అధికంగా ఉన్న‌ట్టు ఆక్స్‌ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌న‌ల‌లో తేలింది.  

Read: విమానాల కోసం ఏటీఎం … డ్రోన్ల కోసం యూటీఎం…

Exit mobile version