Site icon NTV Telugu

జంతువుల్లో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లం: నాలుగు సింహాల‌కు పాజిటివ్‌…

క‌రోనా కేసులు ప్ర‌పంచ దేశాల్లో మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  దీంతో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  అయితే, గ‌తంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నుషుల‌తో పాటుగా జంతువుల‌కు కూడా సోకింది.  ఇప్పుడు మ‌ర‌లా జంతువుల‌కు సోకుతున్న‌ది.  తాజాగా సింగ‌పూర్‌లోని నైట్ స‌ఫారీ జూలోని నాలుగు సింహాల‌కు క‌రోనా సోకింది.  గ‌త కొన్ని రోజులుగా ఈ సింహాలకు జ‌లుబు తుమ్ముల‌తో కూడిన ఫ్లూ సోకింది.  నాలుగు సింహాలు నీర‌సించిపోయి క‌నిపించాయని జూ నిర్వ‌హ‌కులు పేర్కొన్నారు. నైట్ జూ సిబ్బంది ముగ్గురికి క‌రోనా సోక‌డంతో నైట్ స‌ఫారీని తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.  సాధార‌ణ ఫ్లూసోకితే రెండు రోజుల్లో సింహాలు కోలుకుంటాయ‌ని, సాధార‌ణ ఫ్లూ వైర‌స్ వ‌ల‌న పెద్ద‌గా వాటికి ఇబ్బందులు ఉండ‌వ‌ని, ఫ్లూ అధిక‌మైతే యాంటిబ‌యాటిక్స్ అందిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.

Read: ఐరాస‌లో చైనాకు భార‌త్ కౌంట‌ర్‌…

Exit mobile version